BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలోని కొండపై ఉన్న శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభంకానున్నాయి. ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. ఉదయం 11 గంటలకు గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ
నేటి నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు


