హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారి మృతితో బంధువుల ఆందోళన

SRPT: చింతలపాలెం మండలం నక్కగూడెం తండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ పన్నెండేళ్ల బాలిక మల్లేశ్వరి ప్రాణాలు కోల్పోయింది. హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గత నాలుగు రోజులుగా వైద్యం అందించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.