హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ఏర్పాటుతో ప్రజలకు అందిన ఫలాలు!

నిర్మల్ జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జిల్లాలో వచ్చిన మార్పులు చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఉమ్మడి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఖానాపూర్‌ నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. నూతన జిల్లా ఏర్పాటుతో ప్రభుత్వ పాలన ప్రజలకు చేరువైంది. వివిధ పనుల కోసం సుదూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం తగ్గి ప్రజలకు ఉపశమనం లభించింది.