హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి భీమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

SRCL: వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ భీమేశ్వర ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. నేడు అక్టోబర్ 11 నుంచి 20 వరకు ఈ పూజలు జరుగుతాయని, ఉభయ దాతలకు టికెట్ ధర రూ.5,000గా నిర్ణయించినట్లు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృప పొందాలని PRO పెరిక శ్రీనివాస్ తెలిపారు.