WGL: వర్ధన్నపేట పట్టణంలో శనివారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లు తోటి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి సైతం మహిళలతో కలిసి స్టెప్పులు వేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళా కానిస్టేబుళ్ల బతుకమ్మ సంబరాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
తెలంగాణ
మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన చైర్మన్ సారంగపాణి


