HNK: ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని భ్రమరాంభికాదేవి ఆలయంలో ఆదివారం నుంచి ఈ నెల 20 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో కందుల సుధాకర్ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా నవదుర్గ అలంకారాలు, చండీ సప్తశతి పారాయణం, శ్రీచక్రార్చన, చండీ హవనం నిర్వహించనున్నారు. విజయదశమి రోజున శమీపూజ, ఆయుధపూజ తదితర కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.
తెలంగాణ
ఐనవోలులో నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు


