హైదరాబాద్: 28°C
తెలంగాణ

మురుగు సమస్యతో ప్రజల ఇబ్బందులు

VKB: మర్పల్లి మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో ఇళ్ల ముందు మురుగు నిల్వ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో పాటు దోమల బెడద పెరిగి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు కాల్వలు నిర్మించాలని అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని కోరారు.