హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎండల తీవ్రతకు ఎండిపోయిన వరి పంట

JN: జఫర్గడ్‌ మండలం రేగడి తండాలో తీవ్ర ఎండలు, నీటి ఎద్దడితో వరి పంట పూర్తిగా ఎండిపోయింది. ఎంతో కష్టపడి సాగు చేసిన పంటకు నీరందకపోవడంతో పొలాలు నెర్రలుబారి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి,బాధిత రైతులకు తగిన పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.