హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్మెట్టలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

JN: నర్మెట్ట మండలం హన్మంతాపూర్, బొమ్మకూర గ్రామాల్లో మహిళా సంఘాలు, సర్పంచ్‌ల ఆధ్వర్యంలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీధర్ గౌడ్, మండలాధ్యక్షుడు భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.