హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VKB: బొంరాస్‌పేట మండల కేంద్రంలో వీధి దీపాల ఏర్పాటు పనుల నేపథ్యంలో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సర్పంచ్ కోవూరు వీరేశం తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.