హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బతుకమ్మను పేర్చిన కల్వకుంట్ల కవిత

NZB: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత తన ఇంట్లో సంప్రదాయబద్ధంగా బతుకమ్మను అందంగా పేర్చారు. రంగురంగుల పూలతో ఆమె స్వయంగా తీర్చిదిద్దిన బతుకమ్మ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ వేడుకలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.