హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి భద్రకాళి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

WGL: వరంగల్ చరిత్ర ప్రసిద్ధి గాంచిన భద్రకాళి దేవస్థానంలో నేటి నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి పూర్ణాభిషేకం నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అమ్మవారి అలంకరణలు జరగనున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో దేవస్థానం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.