హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్ కాయిల్స్ దొంగ అరెస్ట్

KMR: జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ చోరీ కేసుల్లో పరారీలో ఉన్న తక్ షంషేర్ సింగ్‌ను భిక్కనూర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో 54 కేసులు ఉన్నాయన్నారు. 73 ట్రాన్స్‌ఫార్మర్ల చోరీల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. నిందితుడ్ని రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు.