హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో కిటకిటలాడిన సరస్ మేళా!

HYD: నగరంలో జరుగుతున్న సరస్ మేళా నాలుగో రోజు సందర్శకులతో కిటకిటలాడింది. 40 వేలకు పైగా సందర్శకులు హాజరుకాగా రూ.30 లక్షలకు పైగా విక్రయాలు జరిగాయి. మహిళా సంఘాలు తయారు చేసిన చేనేత వస్త్రాలు, హస్తకళలు, పచ్చళ్లు, చిరుధాన్య ఉత్పత్తులకు విశేష ఆదరణ లభిస్తోంది. వ్యాపార అవకాశాలపై అవగాహన కోసం మండల సమాఖ్య అధ్యక్షులు ప్రత్యేకంగా మేళాను సందర్శించారు.