KNR: నగరంలోని మహాశక్తి దేవాలయంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. ఈ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
తెలంగాణ
దేవాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు


