హైదరాబాద్: 28°C
తెలంగాణ

రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్: ఎస్‌ఈ

MDK: వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంతో జిల్లాలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిందని ఎస్‌ఈ నారాయణ నాయక్ తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌లో 282 మెగావాట్లుగా ఉన్న డిమాండ్, ఈసారి ఏకంగా 506 మెగావాట్లకు చేరినట్లు వెల్లడించారు. ఈ డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను వినియోగదారులకు అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.