MDK: అనుమతులు లేకుండా ఇసుక నిల్వ చేసినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని చిన్న శంకరంపేట ఎస్సై శివానందం హెచ్చరించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులతో పాటు తహసీల్దార్ ముందు బైండోవర్ చేస్తామని, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: నిబంధనలు ఉల్లంఘిస్తే బైండోవర్: ఎస్సై


