హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

NRPT: మరికల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి దేవాలయంలో నేటి నుండి 9 రోజుల పాటు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 7, సాయంత్రం 7 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.