హైదరాబాద్: 28°C
వ్యాపారం

అమెజాన్ పండగ సేల్‌కు రికార్డు స్పందన

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు వినియోగదారుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఈనెల 8న ప్రారంభమైన ఈ సేల్‌లో గతేడాదితో పోలిస్తే రెండింతల ఆర్డర్లు నమోదైనట్లు వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ శ్రీవాస్తవ తెలిపారు. సేల్ ప్రారంభంలోనే అమెజాన్ వెబ్‌సైట్‌ను 44 కోట్ల మంది సందర్శించినట్లు వెల్లడించారు. ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, బ్యూటీ ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉందన్నారు.