హైదరాబాద్: 28°C
వ్యాపారం

HDFC నూతన సీఈఓకి కళ్లు చెదిరే ప్యాకేజీ

HDFC బ్యాంకు నూతన ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్న అనూప్ బాగ్చీ.. దేశంలోనే అత్యధిక వేతనం తీసుకునే బ్యాంకు సీఈఓగా రికార్డు సృష్టించనున్నారు. ఆయనకు ఏకంగా రూ.35.90 కోట్ల వార్షిక ప్యాకేజీని బ్యాంకు ప్రతిపాదించింది. ఇందులో రూ.8.97 కోట్ల స్థిర వేతనం, రూ.26.92 కోట్ల వేరియబుల్ పే ఉంటాయి. అదనంగా షేర్ల రూపంలో రూ.7.35 కోట్ల జాయినింగ్ బోనస్ కూడా ఆయన అందుకోనున్నారు.