PPM: మక్కువ మండలం ఎస్. పెద్దవలస సమీపంలో ఇవాళ ఉదయం ఏనుగులు కనిపించడంతో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎలిఫెంట్ మానిటరింగ్ అధికారి మణికంటేష్ సూచించారు. ఐదు రోజులుగా ఎర్రసామంతవలసతో పాటు పలు గ్రామాల పరిసరాల్లో ఏనుగులు సంచరిస్తుండటంతో రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొలాలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
మక్కువ మండలంలో ఏనుగుల సంచారం


