హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజలకు చేరువగా పని చేయాలి: ఎమ్మెల్యే

KRNL: కల్లూరులో మాధవి నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కేడర్ సమావేశం శనివారం నిర్వహించారు. పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువగా పనిచేయడం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.