హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లడ్డూ అలంకరణలో దర్శనమిచ్చిన లక్ష్మీనరసింహుడు

KDP: గోపవరం మండలం వల్లేవారిపల్లెలోని స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భాద్రపద మాసం చివరి శనివారం, మహాలయ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారు, అమ్మవారు లడ్డూ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తులసి తీర్థాభిషేకం, హోమం తదితర పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.