హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

KRNL: త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శనివారం కర్నూలు నగర శివార్లలోని ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్ కేంద్రం, ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌తో కలిసి ఆమె పరిశీలించారు.