WG: ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, ధ్యానంతో సత్యజ్ఞానం, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తాయని పిరమిడ్ మాస్టర్ అనసూయ తెలిపారు. శనివారం వీరవాసరం సీతారామస్వామి దేవస్థానంలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ఉచిత ధ్యాన శిక్షణ ఇచ్చింది. భగవంతుడిని అష్టదళ పుష్పాలతో పూజించాలని వివరించి సామూహిక ధ్యానం చేయించారు. దసరాలో అఖండ మౌన ధ్యాన యజ్ఞం నిర్వహిస్తామని KVD ప్రసాద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వీరవాసరంలో ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు


