హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.30 లక్షలతో నిర్మాణాలకు శంకుస్థాపన.

పార్వతీపురంపట్టణంలోని 6, 8వ వార్డుల్లో సీసీ రోడ్లు, కాలువలు,శ్మశానవాటికలో షెడ్‌ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శనివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి భూమిపూజ నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రతి వార్డులో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.