NLR: వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శనివారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 23వ వార్డులోని బూసి తోట, మూడవ వార్డు, 9వ వార్డు టీచర్స్ కాలనీ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా మరెన్నో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే


