హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరులో భారీగా ఎగిసి పడిన మంటలు

NLR: ఆత్మకూరు జేఆర్‌పేట మొదటి వీధి ప్రాంతంలోని ఖాళీ స్థలంలోని పిచ్చి మొక్కలకు గుర్తు తెలియని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగతో చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు.