ASR: దసరా సెలవుల్లో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అరకు సీఐ ఏ. కోటేశ్వరరావు సూచించారు. జలపాతాలు, చెరువులు, నదుల వద్ద పిల్లలను ఒంటరిగా వదలకూడదన్నారు. ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ ధరించాలని, అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పిల్లల మొబైల్ వినియోగంపై పర్యవేక్షణ అవసరమని, అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పిల్లల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి : అరకు సీఐ


