హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు

AKP : నర్సీపట్నంలో టౌన్ పోలింగ్ కేంద్రాలను శనివారం సాయంత్రం టౌన్ సిఐ షేక్ గఫూర్, మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, టౌన్ ప్లానింగ్ అధికారి సత్యనారాయణతో కలిసి సందర్శించారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా సాగేలా చర్యలు చేపట్టామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశామని పేర్కొన్నారు.