కోనసీమ: రావులపాలెం బ్రిడ్జి నుంచి వెదిరేశ్వరం మీదుగా పలివెల బ్రిడ్జి వరకు 9 కి.మీ. జాతీయ రహదారి అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరయ్యాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. జాతీయ రహదారి 216Eలో రెండు భాగాలుగా రూ.10 కోట్ల చొప్పున నిధులు కేటాయించి, దెబ్బతిన్న రహదారిని బీటీ రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు. మూడు నెలల్లో పనులు చేపడతామన్నారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ రహదారి మరమ్మతులకు భారీ నిధులు


