NDL: డోన్‌లో సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో బేతంచెర్ల సర్కిల్ రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారందరికీ ఓటు హక్కును పునరుద్ధరించాలని కోరారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలని నాయకులు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి'


