హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ వాసవి ఆలయంలో దేవి నవరాత్రులు

కోనసీమ: అమలాపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి నవరాత్రులు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ శనివారం తెలిపింది. అమ్మవారికి ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు రోజుకో ప్రత్యేక అలంకారం ఉంటుందన్నారున. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని వారు కోరారు.