కోనసీమ: ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ శనివారం ముమ్మిడివరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఎస్పీ రాహుల్ మీనా, డీఎస్పీ ప్రసాద్, సీఐ మోహన్ కుమార్ లతో కలిసి కమ్యూనిటీ పోలీసింగ్ పనితీరును పరిశీలించారు. కార్యాలయ రికార్డులను తనిఖీ చేసి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్సైలు బి. శివకృష్ణ, ఎంవీవీ రవీంద్రబాబు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఐ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఐజీ


