PPM: లక్ష్మీనారాయణపురం–చొక్కాపువానివలస గ్రామాల మధ్య వర్షాలకు దెబ్బతిన్న కల్వర్టును మండల టీడీపీ అధ్యక్షుడు బోను చంద్రమౌళి, కాంట్రాక్టర్ శివరామరాజు తదితరులు పరిశీలించారు. కల్వర్టు మరమ్మతు పనులను తక్షణమే ప్రారంభించాలని ఎమ్మెల్యే ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు చుక్క పోలినాయుడు, బూత్ ఇన్‌చార్జి రవికుమార్, పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్షానికి దెబ్బతిన్న కల్వర్టు పరిశీలన.


