హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజలకు జిల్లా ఎస్పీ హెచ్చరిక

ప్రకాశం: దసరా సెలవుల సందర్భంగా పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని శనివారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. పిల్లలను చెరువులు, కుంటలు, కాలువల వద్దకు ఒంటరిగా వెళ్లనివ్వకూడదన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో తల్లిదండ్రులకు తెలియజేయాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు.