హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: ఎమ్మెల్యే

E.G: కోనేరుపేట, బృందావన కాలనీ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. మోరంపూడి జంక్షన్ సమీపంలోని కోనేరుపేటలో ఆయన శనివారం పర్యటించారు. డ్రైనేజీలను వెంటనే శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.