హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగుల దీక్షకు పేర్ని నాని మద్దతు

కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్‌లో మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన నిరసన దీక్షకు మాజీ మంత్రి పేర్ని నాని సంఘీభావం తెలిపారు. దీక్షలో పాల్గొన్న ఆయన, పార్టీ నాయకులు ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగుల డిమాండ్లను, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని వారికి మద్దతు తెలిపారు.