హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వలస కార్మికుల పిల్లలకు విద్య

GNTR: వలస కార్మికుల పిల్లలకు విద్య అందించడంతో పాటు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సీజనల్ హాస్టళ్లు దోహదపడతాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. శనివారం 25వ డివిజన్‌ దుర్గా నగర్‌లో సీజనల్ హాస్టల్‌ను ప్రారంభించారు. వలస కార్మికులు తమ పిల్లలను హాస్టల్‌లో చేర్పించాలని సూచించారు. విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తారని తెలిపారు.