హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 25న ఉచిత కృత్రిమ చేతులు పంపిణీ

VSP: అక్టోబర్ 25న ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ చేయనున్నట్లు IPS ఆకే రవికృష్ణ తెలిపారు. రెడ్‌క్రాస్, రోటరీ LN-4 సంయుక్త ఆధ్వర్యంలో ప్రమాదాల్లో చేతులు కోల్పోయిన వారికి ఈ సహాయం అందించనున్నట్లు తెలిపారు. అర్హులైన వారు తమ ఫొటోతో 8866306969 నంబర్‌కు సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. సందేహాల కోసం ఈగల్ కాల్ సెంటర్ 1972 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.