హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రోడ్డు ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు

BPT: చీరాల వాడరేవు రహదారిలోని నాలుగు రోడ్ల కూడలి సమీపంలో గుర్తుతెలియని కారు బైక్‌ను ఢీకొట్టి పరారైంది. ఈపూరుపాలెం నుంచి వేటపాలెం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న చిన్నారి కాలికి తీవ్ర గాయం కాగా, తల్లిదండ్రులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.