హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

ప్రకాశం: గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. శనివారం బేస్తవారిపేట గ్రామంలో రూ 50 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో రహదారుల అభివృద్ధితో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కలుగుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.