హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా!

KKD: అన్నవరం సత్యదేవుని దర్శనానికి వెళ్తుండగా రెండో ఘాట్ రోడ్డు మలుపు వద్ద భవాని మాలాధారులు ప్రయాణిస్తున్న ఆటో శనివారం బోల్తాపడింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను అనకాపల్లి జిల్లా రేగుపోలవరానికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను దేవస్థానం సిబ్బంది అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.