హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు న్యాయం చేయాలని నిరసన

KKD: అన్నవరంలో గిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ అన్నవరంలో శనివారం తొలి పావంచాలి వద్ద రైతులు నిరసన తెలిపారు. భూములు కోల్పోయిన తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సంబంధిత అధికారులు స్పందించి, తమ సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు.