SS: కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి ప్రత్యేక పూజలు, వేదపారాయణం, స్వామివారి అలంకార దర్శనాలు ఉంటాయి. విజయదశమి రోజున స్వామివారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు.
ఆంధ్రప్రదేశ్
కదిరి ఆలయంలో రేపటి నుంచి నవరాత్రులు


