హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలి

AKP: మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, స్ట్రాంగ్ రూములు, పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. రిజర్వేషన్ల ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా చేపట్టాలని తెలిపారు.