హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి బాడ్మింటన్ పోటీలకు కే రిడ్జ్ విద్యార్థి

PLD: గుంటూరు బి.ఆర్ స్టేడియంలో జరిగిన ఉమ్మడి జిల్లా అండర్-14 షటిల్ బాడ్మింటన్ పోటీల్లో కే రిడ్జ్ స్కూల్ విద్యార్థి దినేష్ రెడ్డి ద్వితీయ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. ఈ నెల 11, 12 తేదీల్లో కడపలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో అతను పాల్గొంటాడని స్కూల్ చైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా విజేతను పాఠశాల ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు అభినందించారు.