ASR: సీలేరు పీహెచ్‌సీ పరిధిలోని 16 గ్రామాల్లో మలేరియా నివారణ మందుల పిచికారీ చేపట్టారు. వైద్యాధికారి శ్రీసాగర్ ఆధ్వర్యంలో శనివారం వలసగడ్డ, శాండీక్వారీ, బూసికొండ గ్రామాల్లో కార్యక్రమం నిర్వహించారు. మందుల పిచికారీకి ప్రజలు సహకరించాలని, 45రోజులపాటు గోడలకు సున్నాలు, రంగులు వేయవద్దని యూనిట్ అధికారి చిట్టిబాబు, హెచ్ఎస్ త్రినాథ్ ప్రజలకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
16 గ్రామాల్లో మలేరియా నివారణ


