హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి వాసవి నవరాత్రి వేడుకలు

KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈ నెల 11 నుంచి 19వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. 11న దీక్షాబంధనంతో ఉత్సవాలు ప్రారంభమై, 19న అమ్మవారి ప్రత్యేక అలంకరణతో ముగుస్తాయని పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.