హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.16 లక్షలతో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ

KRNL: బదినేహాల్‌లో పల్లె పండుగ 3.0లో భాగంగా రూ.16 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. గ్రామంలో మూడు సీసీ రోడ్లు, ఒక డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు మండల అధ్యక్షుడు చూడి సురేష్ నాయుడు తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీబీపీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.